Seize: కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడి ఇంట్లో భారీగా నగదు పట్టివేత

ఈ క్రమంలోనే వేటపాలెం మండల పరిధిలోని కఠారివారిపాలెంలో ఉన్న ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

Seize: కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడి ఇంట్లో భారీగా నగదు పట్టివేత
X

న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections).. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్(Andrapradesh) రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, ఓటుకు నోటు పేరుతో అధిక మొత్తంలో డబ్బు ఉందని సమాచారం వచ్చిన ప్రతి ప్రదేశానికి వెళ్లి సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల(Bapatla) జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వేటపాలెం మండల పరిధిలోని కఠారివారిపాలెంలో ఉన్న ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పామాంజి నరసింహారావు(Pamanji Narasimha rao) అనే వ్యక్తి వద్ద రూ.23 లక్షల పట్టుబడినట్లు తెలిపారు. నరసింహారావును కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న డబ్బును సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags:
Next Story
Share it