Death: ఫ్రీ బస్సు కోసం తోపులాట.. వృద్ధురాలు మృతి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించి వారిని ప్రత్సాహించడం వరకు బాగానే ఉంది. కానీ, ఈ పథకం వల్ల ప్రజలు ఎన్నో చెడు పరిణామాలను ఎదుర్కుంటున్నారు.

Death: ఫ్రీ బస్సు కోసం తోపులాట.. వృద్ధురాలు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తరవాత మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. రాష్ట్రంలో గత ఏడాది 9 నుంచి ఆర్టీసీ(RTC) పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్(Express) బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించి వారిని ప్రత్సాహించడం వరకు బాగానే ఉంది. కానీ, ఈ పథకం వల్ల ప్రజలు ఎన్నో చెడు పరిణామాలను ఎదుర్కుంటున్నారు. ఓవైపు బస్సు ఎక్కడానికి తోపులాటలు జరుగుతుంటే.. మరోవైపు లోపలికి వెళ్లిన తర్వాత జుట్లు జుట్లు పట్టుకొని మహిళలు తగువులకు వెళ్తున్నారు. వీటి వల్ల కొందరు గాయాలపాలవుతుంటే.. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటువంటి ఓ ఘటనే ఈరోజు రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని హరిదాస్ నాగర్‌కు చెందిన ఎక్కల్దేవీ దేవవ్వ(65) అనే వృద్ధురాలు వారం క్రితం సొంత పని మీద సిరిసిల్లకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల బస్టాండ్‌ వద్ద బస్సు ఎక్కే సమయంలో జరిగింది. ఈ ఘటనలో కందిపడిపోవడంతో దేవవ్వ తీవ్రంగా గాయపడింది. వృద్దురాలిని సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడడంతో వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Tags:
Next Story
Share it