Posani: రాజకీయాలు నాకు కొత్త కాదు

రాజకీయాలలో సర్వోత్తములు .. మానవోత్తములు .. ఉత్తమోత్తములు ఎవరూ ఉండరు.

Posani: రాజకీయాలు నాకు కొత్త కాదు
X

న్యూస్ లైన్ డెస్క్: రాజకీయాలు తనకు కొత్త కాదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani krishna murali) అన్నారు. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూ(Interview)లో మాట్లాడిన ఆయన.. రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. పదవి ఉంటే ప్రజలకు సేవ చేయగలం అనే ఉద్దేశంతో కొందరు రాజకీయాల్లోకి వస్తే.. అధికారంలో ఉంటే దోచుకోవచ్చు అని కొందరు రాజకీయం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలలో సర్వోత్తములు .. మానవోత్తములు .. ఉత్తమోత్తములు ఎవరూ ఉండరు. ఉన్నవాళ్లలో ఎవరు బెటర్(Better) అనుకుంటే వారికే ఓటేయాలని సూచించారు. రాజకీయంలో ఉంటే పదవిలో ఉండాలనే అందరూ ఆలోచిస్తారని ఆయన తెలిపారు. తాను నిజాన్ని, నిజాయితీని నమ్ముతానని పోసాని వెల్లడించారు. నమ్మినదాని కోసం ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే తెలియదు కాబట్టి ముందుగానే చింతిస్తూ కూర్చోవడం సరికాదని పోసాని వ్యాఖ్యానించారు. అందుకే తనకు భవిష్యత్ పట్ల భ్యామనేది ఉండదని అన్నారు.

Tags:
Next Story
Share it