Jagan: 4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది

ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయిస్తామని పేర్కొన్నారు. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Jagan: 4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది
X

న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections).. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్(Andrapradesh) రాష్ట్ర రాజకీయాలు ప్రచార(Campaign) జోరందుకున్నాయి. అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి.. ఇటు లెఫ్ట్ పార్టీల(Left parties)తో కలిసి కాంగ్రెస్ పార్టీ(Congress party) సీఎం జగన్(CM Jagan)ను ఓడించేందుకుకంకణం కట్టుకున్నాయి. ఇది ఇలా ఉండగా జగన్ వరుస సభలతో ప్రజల్లో తిరుగుతూ.. ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజంపేట(Rajampeta)లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయిస్తామని పేర్కొన్నారు. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాల శకం ముగిసిపోయినట్లే అని హెచ్చరించారు. వైసీపీ పాలన కారణంగానే ప్రజలకు మేనిఫెస్టో పైన నమ్మకం వచ్చిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 59 నెలలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. గతంలో ఏనాడూ లేని విధంగా రూ.2.70 లక్షల కోట్లు పేదల కోసం ఖర్చు చేశామని తెలిపారు. పేదల కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు.

Tags:
Next Story
Share it