IPL: టాస్ గెలిచిన లక్నో.. హైదరాబాద్‌తో ఫైట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

IPL: టాస్ గెలిచిన లక్నో.. హైదరాబాద్‌తో ఫైట్
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ హోరాహోరీగా సాగుతుంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌ను ఆటగాళ్లు తీసుకెళ్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అద్భుతంగా ఆడి రాణిస్తుంది. అదే సమయంలో ఆటు లక్నో కూడా ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో 4, 5 స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుడటంతో సిమర్లకు కలిసొచ్చే ఆవకాశం ఉంది. సన్ రైజర్స్ జట్టులో ప్యాట్ కమిన్స్, భువ‌నేశ్వ‌ర్, టి.న‌ట‌రాజ‌న్, మార్కో జాన్‌సెన్ వంటి ఫాస్ట బౌలర్ల ఉన్నారు. ప్లే ఆఫ్ రేసులో నిలవలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కిలకం కానుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్, మ‌యాంక్ అగ‌ర్వాల్, నితిశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ స‌మ‌ద్, ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, మార్కో జాన్‌సెన్, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్‌), భువ‌నేశ్వ‌ర్, టి.న‌ట‌రాజ‌న్.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింట‌న్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్క‌స్ స్టోయినిస్, దీప‌క్ హుడా, నికోల‌స్ పూర‌న్, ఆయుశ్ బ‌దొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, ర‌వి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్,

య‌శ్ ఠాకూర్.

Tags:
Next Story
Share it