IPL: మిస్టర్ 360 సూర్య కుమార్ క్లాస్ సెంచరీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్‌లో సోమవారం సాయత్రం జరిగిన హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

IPL: మిస్టర్ 360 సూర్య కుమార్ క్లాస్ సెంచరీ..!
X

హైదరాబాద్ కు ఝలక్ ఇచ్చిన ముంబై

తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్

హర్థిక్ - చావ్లా బౌలింగ్ షో..!

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్‌లో సోమవారం సాయత్రం జరిగిన హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో చెలరేగగా.. తిలక్ వర్మ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(11) జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే మయాంక్ అగర్వాల్(5) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఎచ్‌ఆర్‌హెచ్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో నితీష్ కుమార్ దిగాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. మరోవైపపు హెడ్ ముంబై బౌలర్లకు ఊచకోత చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుకు 50 రన్స్ జతచేశారు. అయితే హెడ్(48) పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత నితీష్ కుమార్(20), హెన్రీ క్లాసన్(2), షాహ్‌బాజ్(10) బ్యాటింగ్‌లో విఫలమయ్యరు. దీంతో హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్(35) చివరి వరకు క్రీజులో ఉండి హైదరాబాద్‌ జట్టుకు మంచి స్కోర్‌ని అందించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు హర్థిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టాగా.. జస్ప్రీత్ బుమ్రా, అంశుల్ కంబోజ్ చెరో వికెట్ తీశారు.

174 పరుగల లక్ష్యాని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(4), ఇషాన్ కిషన్(9) పెవిలియన్‌కు చేరారు. ఆ కాసేపటికే నమాన్ ధీర్ కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులో దిగిన సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక సూర్య కుమార్ గేర్ మార్చి విధ్వంసం బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సూర్య( 51 బంతుల్లో 102 పరుగులు 12 ఫోర్లు, 6 సిక్సర్లు ) సహాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ తిలక్ వర్మ(37) విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి ఆఖరి వరకు ఉండి ముంబై జట్టుకు విజయం అందించారు. దీంతో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు మారకో ఎన్సన్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమ్మిన్స్ తలా వకెట్ తీశారు.

Tags:
Next Story
Share it