IPL: ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ సునామీ.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.

IPL: ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ సునామీ.!
X

అదరగొట్టిన హెడ్, శర్మ జోడీ

లక్నోపై సన్ రైజర్స్ సూపర్ విక్టరీ

బౌండరీలతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

పదో ఓవర్‌లో 165 లక్ష్యాన్ని ఛేదించిన సన్ రైజర్స్

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో లక్నో బౌలర్లకు ఊచకోత చూపించారు. దీంతో హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(2) భూవనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్కాస్ స్టొయినిస్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో లక్నో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో కృనాల్ పాండ్యా దిగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మరోవైపు రాహుల్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. అయితే రాహుల్(29) ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌‌లో ఔటయ్యాడు. ఆ కాసేపటికే కృనాల్(24) కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో లక్నో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన నికోలాస్ పూరన్, అయూష్ బదోని వచ్చారు. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక బాదోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు కొడుతూ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో బదోని( 30 బంతుల్లో 56 పరుగులు 9 ఫోర్లు) సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో పూరన్ బౌండరీల మెత్త మోగించాడు. ఇక బదోని(55), పూరన్(48) చివరి వరకు క్రీజులో ఉండి లక్నో జట్టు మంచి స్కోర్‌ను అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు భూవనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాగా.. ప్యాట్ కమ్మిన్స్ ఒక వికెట్ తీశాడు.

స్పల్ప లక్ష్యాని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక ట్రావిస్ హెడ్ సిక్సర్లతో ఉప్పల్ స్టేడియంలో సునామీ సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ లక్నో బౌలర్లకు ఊచకోత చూపించాడు. దీంతో హెడ్( 21 బంతుల్లో 66 పరుగులు 8 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ లక్నో బౌలర్లను దంచికొట్టాడు. దీంతో అభిషేక్( 23 బంతుల్లో 64 రన్స్ 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. ఈ హెడ్(89), శర్మ(75) జోడి 10 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా లక్ష్యాని ఛేదించిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు సృష్టించింది. దీంతో హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags:
Next Story
Share it