Gold rates : తగ్గిన బంగారం ధరలు... తులం ఎంతంటే ?

బంగారం (Gold Rates) కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Gold rates : తగ్గిన బంగారం ధరలు... తులం ఎంతంటే ?
X

Gold Rates: బంగారం (Gold Rates) కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా వరుసగా బంగారం ధరలు (Gold Rates) తగ్గుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని అంతర్జాతీయ కారణాలవల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక మొన్నటికి మొన్న... బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరిగాయి. ఈ తరుణంలోనే తులం బంగారం (Gold ) కొనుగోలు చేయాలంటే 75 వేల రూపాయలు చేతిలో ఉండాల్సిందే అన్న పరిస్థితి నెలకొంది.

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో (Hyderabad) తగ్గిన బంగారం (Gold Rates) అలాగే వెండి ధరల వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి 72,590 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి 66,540గా నమోదు అయింది. అంతేకాకుండా వెండి ధర (Silver rates) కిలో వంద రూపాయలు తగ్గి 83,900 రూపాయలుగా నమోదు అయింది.

Tags:
Next Story
Share it