Mahindra XUV 3XO: కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో కొత్త కారు

మేడ్ ఇన్ ఇండియా.. ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్ ( MAHENDRA X UV 3X) యూవీ 3ఎక్స్ఓ కొత్త కారు లాంచ్ చేసింది.

Mahindra XUV 3XO: కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో కొత్త కారు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మేడ్ ఇన్ ఇండియా.. ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్ ( MAHENDRA X UV 3X) యూవీ 3ఎక్స్ఓ కొత్త కారు లాంచ్ చేసింది. ఇది మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్( FACE LIFT VERSION) . కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మార్కెట్ టాపర్లకు ఇది గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారును ఇవాళే లాంచ్ చేశారు. ధరల శ్రేణి రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానుండడం, మధ్యతరగతి వారికి శుభవార్త అని చెప్పవచ్చు. మే 15 నుంచి ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మహీంద్రా సంస్థ వెల్లడించింది. మే 26 నుంచి కారు డెలివరీలు షురూ అవుతాయి.

స్లీక్ పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్( FINISH GRILL) , ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్( HEAD LAMPS) , ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్( FOG LAMPS) తో ఫ్రంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఐవరీ కలర్ ఇంటీరియర్స్ తో కారు లోపలి భాగం రిచ్ గా కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ లెదర్ డాష్ బోర్డు, లెదర్ సీట్లు, స్టీరింగ్ పై లెదర్ కవర్, లెదర్ గేర్ నాబ్, లెదర్ ఫ్రంటర్ ఆర్మ్ రెస్ట్ తో ఈ కారుకు ప్రీమియం లుక్ వచ్చింది.

ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 60 కిలోమీటర్ల పికప్ అందుకుంటుంది. మైలేజి విషయానికొస్తే... మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లో ఇది ఒక లీటరుకు 20.1 కి.మీ పయనిస్తుందని ప్రచారంలో ఉంది. ఇందులో రెండు హెచ్ డీ స్క్రీన్లు ఉంటాయి. అందులో ఒకటి 26.03 సెంమీ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ కాగా, మరొకటి 26.03 సెంమీ ఫుల్ డిజిటల్ క్లస్టర్( DIGITAL CLUSTERS) . మహీంద్ర ఎక్స్ యూవీ ఎప్పుడు సేఫ్టీకి పెద్ద పీట వేస్తుంది. 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. బ్లైండ్ వ్యూ మానిటర్ తో కూడిన 360 డిగ్రీ కెమెరా( CAMERAS) , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ( ELECTRONIC STABILITY) కంట్రోల్ విత్ హిల్ హోల్డ్, నాలుగు డిస్క్ బ్రేకులు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. మహీంద్ర ఇది కంప్లీట్ గా మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ గా ఉండేలా చూసుకుంది. అందులో కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండేలా చూసుకుంటుంది.

Tags:
Next Story
Share it