CREADIT CARD: క్రెడిట్ కార్డు కస్టమర్లకు కొత్త రూల్స్ మే 1 నుంచే అమలులోకి!

క్రెడిట్ కార్డులతో( CREDIT CARD) ఇలాటి యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే ఒకప్పుడు రివార్డులు ( REWARD) వచ్చేవి.

CREADIT CARD: క్రెడిట్ కార్డు కస్టమర్లకు  కొత్త రూల్స్ మే 1 నుంచే అమలులోకి!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు( CREDIT CARD) లేని వారు చాలా తక్కువ. రెంట్ నుంచి కరెంట్ వరకు అంతా క్రెడిట్ కార్డే..నెలంతా ఖర్చులు పెట్టడం ..నెలాఖరుకు కట్టలేక అగచాట్లు పడడం చాలా కామన్..కాని ఉండాల్సిందే...అప్పు పుట్టే రోజులు కావు ఇవి. అయితే ఈ క్రెడిట్ కార్డుకు కొత్త రూల్స్ పెట్టారు బ్యాంకులు. అవి కూడా రేపటి నుంచే అమలులోకి వస్తాయి.

క్రెడిట్ కార్డులతో కరెంటు బిల్లు, ఫోన్( PHONE) , గ్యాస) ( GAS) , వాటర్ బిల్లులు ( WATERBILLS) చెల్లిస్తున్నారా? అయితే మీకో అలర్ట్. క్రెడిట్ కార్డులతో( CREDIT CARD) ఇలాటి యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే ఒకప్పుడు రివార్డులు ( REWARD) వచ్చేవి. కానీ, ఇక అలాంటివి ఏమీ ఉండవు. క్రెడిట్ కార్డులతో యుటిలిటీ బిల్లులపై అదనపు ఛార్జీలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించాయి.

యెస్ బ్యాంకులో( YES BANK) నెలవారీ యుటిలిటీ బిల్లుల( UTILITY BILLS) విలువ రూ.15 వేలు దాటితే ఒక శాతం అదనపు ఫీ వర్తిస్తుంది. అంటే ఫోన్( PHONE) , కరెంట్( CURRENT) , టీవీ( TV) , అద్దె ఇలా వివిధ యుటిలిటీ బిల్లల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటిందనుకుంటే.. ఆ తర్వాత కూడా మళ్లీ ఏదైనా యుటిలిటీ బిల్లు చెల్లిస్తే అదనపు ఫీజు కట్టాలి. ఐడీఎఫ్‌సీ( IDFC) బ్యాంకులో ఈ లిమిట్ రూ.20 వేలుగా ఉంది.

వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ లిమిట్( CREDIT CARD LIMIT) తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపార అవసరాలను సైతం యుటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు. దీని వల్ల బ్యాంకులు నష్టపోతాయంటున్నారు అధికారులు . దీన్ని నివారించేందుకు సైతం ఈ అదనపు ఛార్జీలు వస్తూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అది మే 1 వతేదీ నుంచి ఇవి అమలులోకి రానున్నట్లు తెలిపారు.

Tags:
Next Story
Share it