Home Loan: బ్యాంకు లోన్స్ అన్నింటిలో హౌసింగ్ లోన్సే ఎక్కువట!

గత సంవత్సరాల్లోనే గృహ రుణ బకాయిలు ఏకంగా రూ. 10 లక్షల కోట్లు (రూ.10 ట్రిలియన్లు) పెరిగాయి.

Home Loan: బ్యాంకు లోన్స్ అన్నింటిలో హౌసింగ్ లోన్సే ఎక్కువట!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హౌసింగ్ లోన్స్( houseing loan) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ( reserve bank) ఆఫ్ ఇండియా షాకింగ్ విషయాలు చెప్పింది. ఇంటి అప్పులు గణాంకాలు ఆశ్చర్యకరమైన వేగంతో పెరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం( house ) లేదా కొనుగోలు కోసం బ్యాంక్‌లు/ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల( finance comapanies) నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి, హౌసింగ్ లోన్ డేటాను ఆర్‌బీఐ ( rbi) ఆదివారం విడుదల చేసింది. బ్యాంకు లోన్స్ లో హౌసింగ్ లోన్స్ తీసుకునే వాళ్లే చాలా ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా లెక్కల ప్రకారం, 2024 మార్చితో( march) ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (FY24) మొత్తం గృహ రుణ బకాయిలు (Home Loan Outstanding) రూ. 27.23 లక్షల కోట్లకు (రూ. 27.23 ట్రిలియన్లు) చేరింది. ఇవి.. 2022 మార్చి ముగింపు (FY22) నాటికి రూ. 17,26,697 కోట్లుగా ఉండగా, 2023 మార్చి ముగింపు ‍‌(FY23) నాటికి రూ.19,88,532 కోట్లుగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే, కేవలం గత సంవత్సరాల్లోనే గృహ రుణ బకాయిలు ఏకంగా రూ. 10 లక్షల కోట్లు (రూ.10 ట్రిలియన్లు) పెరిగాయి.

గృహ రుణాలు పెరగడానికి కొవిడ్‌( covid) కాలంలో పుట్టుకొచ్చిన హౌసింగ్ డిమాండ్ కూడా ఓ కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. కొవిడ్‌ తర్వాత అన్ని ప్రైస్‌ రేంజ్‌ల్లోనూ గిరాకీ వృద్ధి చెందింది. తిండి, నీడ, గుడ్డ ఉంటే బ్రతకొచ్చనే ఆలోచనే అందరిది..కాబట్టి ఎంత కష్టమైనా ఇంటి లోన్ పెట్టుకొనైనా సొంతఇంటికోసం కలలు కంటున్నారు.

Tags:
Next Story
Share it