bhakthi: ప్రయాణానికి శుభ శకునాలు ఇవే

ఎవరు ఏ శుభకార్యం కోసం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని బయలుదేరడం మంచిది.

bhakthi: ప్రయాణానికి శుభ శకునాలు ఇవే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎవరు ఏ శుభకార్యం కోసం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని బయలుదేరడం వల్ల తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం .సాధారణంగా ముత్తయిదువులు ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. అలాగే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వేస్తారు. శవం ఎదురు వస్తే శుభశకునం.

* ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల ( mangala vayidyalu) వినిపించినా .. గంట ధ్వని వినిపించినా శుభప్రదమేనని శాస్త్రం చెబుతోంది.

* గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుండగా ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లా పాపాలతో కూడిన దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరవచ్చని అంటారు.

*ఇక అనుకోకుండా ఏనుగు( elephant) .. గుర్రం( horse) .. ఆవులు ( cow) ఎదురైనా, తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని చెబుతారు.

*ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా .. చెడు వార్త విన్నా, కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోవాలి. మంచినీళ్లు తాగేసి .. ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు.

* చంటి పిల్లలు నవ్వుతు ఎదురు రావడం మంచిది.

* పచ్చని పసుపు, మామిడి ఆకులు, లాంటివి తీసుకొని ఎవరైనా ఎదురు వస్తే చాలా మంచిది.

Tags:
Next Story
Share it