Business News: చదరపు గజానికి రూ. 29 లక్షలా? అసలు ఏ దేశంలో ఎంత రేటు ?

ఫ్లాట్ ( falt) కొందామనుకుంటే.. ఫస్ట్ మాట్లాడుకునే మాట గజం రేటు ఎంత? ఏ ఏరియా లో ఎంత రేటు ఉంది. కొన్ని ఏరియాల్లో చదరపు గజానికి 10 వేలు, 20 వేలు రూపాయిలుంటుంది

Business News: చదరపు గజానికి రూ. 29 లక్షలా? అసలు ఏ దేశంలో ఎంత రేటు ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫ్లాట్ ( falt) కొందామనుకుంటే.. ఫస్ట్ మాట్లాడుకునే మాట గజం రేటు ఎంత? ఏ ఏరియా లో ఎంత రేటు ఉంది. కొన్ని ఏరియాల్లో చదరపు గజానికి 10 వేలు, 20 వేలు రూపాయిలుంటుంది. ఒక్కో చదరపు గజానికి పది, ఇరవై లక్షలు ( tweanty lakhs) రేటు పలికితే ..ఈ లెక్క తేల్చేందుకే ప్రపంచ ప్రఖ్యాత హెన్లీ అండ్ పార్ట్ నర్స్(henly and parts nurse) సంస్థ ఇటీవల ప్రపంచంలోనే ఖరీదైన నగరాల లిస్టును విడుదల చేసింది. ఏ దేశంలో ఎంత చదరపు గజం ఎంత రేటు పలుకుతుందో తెలుసుకుందాం రండి.

1వ స్థానం – మొనాకోలోని మొనాకో సిటీలో రూ. 29 లక్షల 64 వేలు

2వ స్థానం – అమెరికాలోని న్యూయార్క్ సిటీలో రూ. 23 లక్షల 71 వేలు

3వ స్థానం – యూకేలోని లండన్లో రూ. 22 లక్షల 13 వేలు

4వ స్థానం – హాంకాంగ్ సిటీలో రూ. 21 లక్షల 54 వేలు

5వ స్థానం – ఫ్రాన్స్ లోని సెయింట్ జీన్ కేప్ ఫెరాట్లో రూ. 20 లక్షల 87 వేలు

6వ స్థానం – ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రూ. 18 లక్షల 95 వేలు

7వ స్థానం – ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో రూ. 15 లక్షల 36 వేలు

8వ స్థానం – అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో రూ. 14 లక్షల 86 వేలు

9వ స్థానం – అమెరికాలోని పామ్ బీచ్ సిటీలో రూ. 14 లక్షల 61 వేలు

10వ స్థానం – అమెరికాలోని మియామీ బీచ్ లో రూ. 14 లక్షల 66 వేలు

వీటి తర్వాత స్థానాల్లో.. సింగపూర్, యూఎస్ఏలోని ది బే ఏరియా, ఫ్రాన్స్ లోని నైస్, స్విట్జర్లాండ్ లోని జెనీవా, ఫ్రాన్స్ లోని కేన్స్, సెయింట్ ట్రోపెజ్, యాంటిబ్స్, ఇటలీలోని పొర్టోఫినో, జపాన్ లోని టోక్యో, స్విట్జర్లాండ్ లుగానో.. సిటీలు నిలిచాయి. ఈ దేశాల్లో దాదాపు 12 లక్షల రూపాయిలుంటే చాలు.

Tags:
Next Story
Share it