NO IRON: ఈ ఆఫీస్ లో పనిచేయాలంటే నో ..ఇస్త్రీ బట్టలు

ఉద్యోగం ఏదైనా నీట్ గా వెళ్లాలంటే ఇస్త్రీ బట్టలు వేసుకోవల్సిందే. ఈ కంపెనీలో మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆఫీస్ కు రావద్దని ఆర్డర్ చేశారు

NO IRON: ఈ ఆఫీస్ లో పనిచేయాలంటే నో ..ఇస్త్రీ బట్టలు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆఫీస్ అనగానే ఇస్త్రీ బట్టలు కంపల్సరీ...ఉద్యోగం ఏదైనా నీట్ గా వెళ్లాలంటే ఇస్త్రీ బట్టలు వేసుకోవల్సిందే. అయితే ఈ కంపెనీలో మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆఫీస్ కు రావద్దని ఆర్డర్ చేశారు కంపెనీ అధికారులు.Council of Scientific and Industrial Research (CSIR) కంపెనికి ప్రతి సోమవారం నో ఐరన్ డ్రెసెస్ రూల్ ఫాలో అవ్వాలని సూచించింది. ఈ రూల్‌కి ‘WAH Mondays’ అనే పేరు పెట్టింది. WAH అంటే ‘Wrinkles Acche Hai’ అని. ముడతలున్నా మంచిదే అని అర్థం. CSIR తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఎన్ కాళైసెల్వి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇస్త్రీ ( IRON CLOTHS) చేయడం వల్ల వాతావరణంలోకి 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అలా రోజూ ఇస్త్రీ చేస్తే వాతావరణం కలుషితమైపోతుందన్నది CSIR చెబుతున్న విషయం. అదీ కాక మన కంటే చిన్న ఉద్యోగస్థులు మన బట్టలు చూసి ఒక్కసారైనా హ్యాపీగా ఫీలవుతారంటు చెప్పుకొచ్చారు..ఉదాహరణకు ఏడాది పాటు వారానికి 5 షర్ట్స్ ఇస్త్రీ చేశారనుకుంటే...7 కిలోమీటర్ల దూరం వరకూ ఓ కార్‌ని డ్రైవ్ చేస్తే వాతావరణంలోకి ఎంత CO2 విడుదలవుతుందో కొన్ని సార్లు ఇలాంటి చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద మార్పులు తీసుకు వస్తాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఎక్స్‌పర్స్ట్ ఇస్తున్న మరో సలహా ఏంటంటే..కనీసం రెండుసార్లైనా వాడిన తరవాతే ఆ దుస్తులను వాషింగ్‌కి వేయాలి. మనకు సరిపోని దుస్తుల్ని ఊరికే పారేయకుండా ఎవరికైనా దానం చేస్తే వ్యర్థాలు తగ్గిపోతాయి. దయచేసి పర్యావరణాన్ని కాపాడండి..అంటు కంపెనీ పోస్ట్ చేసింది.

Tags:
Next Story
Share it