kodi rammurthi: తెలుగు బాహుబలికి ..తెలుగు నాట ఆశ్రయం లేదు

ఏనుగును( elephant) గుండెల మీద నడిపించుకున్న బలవంతుడు... లండన్‌లో జార్జి చక్రవర్తి ముందు జరిగిన కార్యక్రమంలో రెండు చేతులతో ఒక రైలును ఆపివేసినవాడతను.

kodi rammurthi: తెలుగు బాహుబలికి ..తెలుగు నాట ఆశ్రయం లేదు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏనుగును( elephant) గుండెల మీద నడిపించుకున్న బలవంతుడు... లండన్‌లో జార్జి( london geroge) చక్రవర్తి ముందు జరిగిన కార్యక్రమంలో రెండు చేతులతో ఒక రైలును ఆపివేసినవాడతను. స్పెయిన్‌లో బుల్ ఫైట్‌లో అనుభవం లేకుండా పాల్గొని భయంకాకృతిలో బలంగా ఉన్న దున్నపోతును వంగదీసి నిలబెట్టేశాడు కోడి రామ్మూర్తి . .దేశదేశాల్లో ప్రదర్శనలిచ్చి ఆరోజుల్లోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు. అక్కడెక్కడ సంపాదించిన డబ్బంతా ...దానధర్మాలకు, జాతీయోద్యమానికి( freedom fight) ఖర్చుచేసి చివరకు పేదవాడైపోయాడు. కొన్ని వేల రూపాయిలు దానాలు ధర్మాలు చేసిన వ్యక్తి ...ఆఖరికి తన ఆరోగ్యానికి కూడా డబ్బులు లేవు. కాలి మీద రాచపుండు లేవడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. మత్తుమందు కూడా తీసుకోకుండా యోగపద్ధతిలో శరీరంలో నొప్పి పుట్టినా తట్టుకుంటూ కాలు తీసేయించుకునే ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి.

ఆ తర్వాత పూటగడవడానికి కూడా లేని దుస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో కాశీలోని మదన మోహన మాలవ్యాను దర్శించి పరిస్థితి చెప్పారు. సాక్షాత్తూ కోడి రామ్మూర్తి నాయుడి( kodi rammurthi naidu) కి ఇలాంటి పరిస్థితి రావడంతో బాధపడిన ఆయన, తాను నిర్వహిస్తున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో( hindhu visha vidhyalayam) గౌరవ పదవి ఇచ్చి, నెలకు అప్పట్లో 500 జీతం, ఒక బంగళా పనిమనుషులు వంటి సౌకర్యాలన్నీ ఏర్పాటుచేసి ఆయనను గౌరవించుకున్నారు. అలానే ఒడిశాకు ( odissa) చెందిన ఒక జమీందారు కూడా ఆయనకు వేతనం ఇచ్చి గౌరవించాడు. అంత మహానుభావుడికి ఎందుకనో ఆంధ్రదేశంలో ఆశ్రయం దొరకలేదు . కనీసం వారణాసిలో దొరికిందని సంతోషించాల్సిందే. ఆయన పేరు మీద శ్రీకాకుళంలో ఓ స్టేడియం ఉండేది ...దాన్ని కూడా కూల్చేశారు మన పాలకులు. అయితే..ఇప్పటికి ఆ మహానుభావుడుకి పేరు కూడా తలుచుకోవడం లేదు.

నోట్: పవన్ సంతోష్ ట్విట్టర్ అకౌంట్ నుంచి సేకరించడమైనది.

Tags:
Next Story
Share it