Raayan: ధనుష్ "రాయన్" నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

Raayan: ధనుష్ రాయన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
X

న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వంతంగా దర్శకత్వం చేస్తూ హీరోగా నటిస్తున్న సినిమా "రాయన్(Raayan)"..ఈ సినిమా ధనుష్ 50వ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ పెరిగిపోయాయి.అలాగే ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi maaran) నిర్మిస్తున్నారు. అలాగే రాయన్ మూవీలో దుషార విజయన్,అపర్ణ బాలమురళి హీరోయిన్స్ గా చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ప్రభుదేవా(Prabhudeva) డ్యాన్స్ కంపోజ్ చేసిన,ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు.ఇక ఒకేసారి తమిళ,తెలుగు, హిందీ భాషల్లో ఏఆర్ రెహమాన్ ఈ సాంగ్ విడుదల చేశారు.. "తలవంచి ఎరగడే" అంటూ తెలుగులో వస్తున్న రాయన్ మూవీ మొదటి పాట (Raayan movie first song) లో ధనుష్ మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టేశారు. ఇక ఈ పాటకి ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఇక మరొక విషయం ఏమిటంటే..ఈ పాటకి సంబంధించిన తమిళ వెర్షన్ ని స్వయంగా ధనుష్ కంపోజ్ చేయడం విశేషం.

ఇక ధనుష్ (Dhanush) హీరోగా చేస్తున్న రాయన్ మూవీలో సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, సందీప్ కిషన్,ఎస్.జే.సూర్య, కాళిదాసు జయరామన్ వంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ నే కాదు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.ఈ సినిమా జూన్ 13న విడుదలవబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం రాయన్ మూవీ (Raayan) నుండి విడుదలైన ఫస్ట్ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది.

https://youtu.be/8tnAanw9S1o?si=5EyBHxpu_kQaggeq

Tags:
Next Story
Share it