Gorre Puranam: ఆకట్టుకుంటున్న సుహాస్ "గొర్రె పురాణం" టీజర్..!

కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు నటుడు సుహాస్.గతంలో ఈయన షార్ట్ ఫిలిమ్స్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు. కానీ కలర్ ఫోటో సినిమా ఆయన

Gorre Puranam: ఆకట్టుకుంటున్న సుహాస్ గొర్రె పురాణం టీజర్..!
X

న్యూస్ లైన్ డెస్క్: కలర్ ఫోటో సినిమా(Colour photo movie) తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు నటుడు సుహాస్.గతంలో ఈయన షార్ట్ ఫిలిమ్స్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు. కానీ కలర్ ఫోటో సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమా తీసినప్పటి నుండి మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాల్లో హీరోగా సెటిల్ అవుతున్నాడు.ఇక రీసెంట్ గా ఈయన చేసిన ప్రసన్న వదనం సినిమా (Prasanna vadanam movie) థియేటర్లలో పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది.

అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే మరో కొత్త సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. బాబీ దర్శకత్వంలో వస్తున్న "గొర్రె పురాణం(Gorre Puranam)" మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ వచ్చేసింది.ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ టీజర్ లో ఏముందంటే..టీజర్ స్టార్టింగ్ లోనే బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ ఒక గొర్రె కారణంగా ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చు వచ్చింది అంటూ ఒక వాయిస్ వస్తుంది. ఆ గొర్రె మాదంటే మాది అని ముస్లిం,హిందువులు ఇద్దరూ మాటల యుద్ధం చేసుకుంటారు. పదివేలైనా ఇస్తాం కానీ గొర్రెనివ్వం అని హిందువులు అంటే, 10 కోట్లు ఇచ్చిన వద్దు అంటూ ముస్లింలు అంటారు.

అలా హిందూ ముస్లిం మధ్య గొడవ జరుగుతుంది. అదే సమయంలో గొర్రె తప్పించుకొని వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని గొర్రె లోలోపల అనుకుంటుంది. ఇక అదే సమయంలో ఖైదీ డ్రెస్ తో హీరో సుహాస్(Suhas) ఎంట్రీ ఇస్తారు. మరి సుహాస్ ఆ గొర్రెను కాపాడతాడా.. అసలు గొర్రె వల్ల గ్రామంలోని హిందూ, ముస్లిం మధ్య ఎలాంటి గొడవ వచ్చింది.. గొర్రెకు సుహాస్ కి ఏదైనా సంబంధం ఉంటుందా అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే.అయితే టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా కి మరింత హైప్ పెరిగింది. మొత్తానికి సుహాస్ (Suhas) మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

https://youtu.be/tffRKxKrZhQ?si=AQEt2c9-EuVuyiBr

Tags:
Next Story
Share it