Honda Activa 6G:రూ:2640తో న్యూ హోండా యాక్టివా..!

ప్రస్తుత కాలంలో చాలామంది స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక మార్కెట్లో ఉన్న స్కూటర్ కంపెనీలన్నింటిలో హోండా కంపెనీకి చెందిన స్కూటర్లు అత్యధిక ఆదరణ పొందాయి.

Honda Activa 6G:రూ:2640తో న్యూ హోండా యాక్టివా..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది స్కూటర్ల(Scooters) ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక మార్కెట్లో ఉన్న స్కూటర్ కంపెనీలన్నింటిలో హోండా కంపెనీ(Honda company) కి చెందిన స్కూటర్లు అత్యధిక ఆదరణ పొందాయి. హోండా నుంచి ఇప్పటికి హోండా యాక్టివా 4g,5g రిలీజ్ అయి దూసుకుపోతున్నాయి.

అయితే తాజాగా హోండా యాక్టివా నుంచి 6జి స్కూటర్ (Honda Activa 6G scooter) కూడా మన ముందుకు వచ్చింది. మరి ఈ బైక్ యొక్క ఫీచర్స్, మైలేజ్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. హోండా యాక్టివా 6g స్కూటర్లో 109.51cc 4స్ట్రోక్ Si ఇంజన్ 7.84 Ps పవర్ మరియు 8.90Mn పిక్ టార్కు ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా దీని ఇంజన్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ 5.3 లీటర్ ఇందులోనే ట్యాంక్ అమర్చబడి ఉంటుందట. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఎల్ఈడి డిసీ హెడ్ లాంప్(Head lamp) , అన్ లాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ACG తో సైలెంట్ స్టార్ట్,ESP టెక్నాలజీ, క్యారీ హుక్, కాంబి బ్రేకింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఈ హోండా స్కూటర్(Honda scooter) యొక్క ధర విషయానికి వస్తే.. రూ:75,347 -81,347 ఎక్స్ షోరూం ధరలు నిర్ణయించబడ్డాయి. ఒకవేళ ఇంత బడ్జెట్ లేకపోతే మీరు రూ:2601 పొందవచ్చు. మొత్తం 36 నెలల పాటు 9.7 వడ్డీ రేటు తో ఈఎంఐ సౌకర్యం ఉంది. హోండా యాక్టివా 6g కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. రెబల్ రెడ్ మెటాలిక్, ఫర్లు సైరన్ బ్లాక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, ఫెరల్ ప్రేసియస్ వైట్, మ్యాట్ యాక్సిస్ గ్రే వంటి కలర్ ఆప్షన్స్ లో మార్కెట్ లో లభిస్తోంది.

Tags:
Next Story
Share it