Prostitution : ఆ స్టూడియో పక్కనే వ్యభిచార దందా

హైదరాబాద్ లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఓ వ్యభిచార ముఠాపై పోలీసులు దాడులు చేశారు.

Prostitution : ఆ స్టూడియో పక్కనే వ్యభిచార దందా
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : హైదరాబాద్ లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఓ వ్యభిచార ముఠాపై పోలీసులు దాడులు చేశారు. కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో ఇంట్లో తనిఖీలు చేశారు. ఇద్దరు యువతులతో పాటు ఒక విటుడిని అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లో ఓ 14 ఏళ్ల మైనర్ బాలిక ఉన్నట్లు గుర్తించారు. ఎవరూ లేని ఆ బాలికను చేరదీసి వ్యభిచార ఊబిలోకి దింపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.

హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు వ్యభిచారాలకు అడ్డాగా మారిపోయాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదింటి అమ్మాయిలతో పాటు ఎవరూ లేని అనాథలను చేరిదీసి ఈ దందాలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ఏరియాల్లో ఇతర రాష్ట్రాల అమ్మాయిలను సైతం ఈ రొంపిలోకి దింపుతున్నారు. నిన్నమొన్నటి వరకు సాటుగా చేసే ఈ దందా ఇప్పుడు పట్టపగలే అడ్డుఅదుపు లేకుండా సాగుతుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఓయో రూములను సైతం అద్దెగా తీసుకొని చాటుగా ఈ వ్యభిచారం చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags:
Next Story
Share it