bank officers: బ్యాంకు స్టాఫ్ ను పొట్టుపొట్టు తిట్టిన ఆఫీసర్...వైరల్ అవుతున్న వీడియో

ప్రభుత్వ రంగానికి కూడా ఉంది. అయితే రీసెంట్ గా టార్గెట్స్ రీచ్ కాలేదని బండబూతులు తిట్టాడట...అధికారులు. దీంతో ఎంప్లాయ్ కి తిక్క రేగి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

bank officers: బ్యాంకు స్టాఫ్ ను పొట్టుపొట్టు తిట్టిన ఆఫీసర్...వైరల్ అవుతున్న వీడియో
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మార్కెట్ ( market) అంతా టార్గెట్స్ మీదే నడుస్తుంది. అన్ని కోట్ల వ్యాపారం జరగాల్సిందే...జరిగితీరాల్సిందే.. పోటీ ప్రపంచం అలా పరుగులు తీయక పోతే నెంబర్ వన్ రేస్ లో ఉండడం కష్టం. ఈ టార్గెట్స్ ఒక్క ప్రైవేట్ రంగానికే కాదు..ప్రభుత్వ రంగానికి కూడా ఉంది. అయితే రీసెంట్ గా టార్గెట్స్ రీచ్ కాలేదని బండబూతులు తిట్టాడట...అధికారులు. దీంతో ఎంప్లాయ్ కి తిక్క రేగి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెలవు రోజుల్లోనైనా పనిచేయాల్సిందేనని ఆదేశించడం, బెదిరింపు ధోరణిలో వారు మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు...నీ ఫ్యామిలీ లైఫ్ తో నాకేంటి సంబంధం అంటూ ఆ అధికారి అనడంతో మరింత ఫైర్ అయిపోతున్నారు.

వీడియోలో కెనరా బ్యాంక్( canara bank) ఉన్నతాధికారి లోకపతి స్వెయిన్ తన కింద పనిచేసే ఉద్యోగులను స్కైప్ కాల్ లో మందలిస్తున్న వీడియో సోషల్ మీడియా( social media) ప్లాట్ ఫాంలో చక్కర్లు కొడుతోంది. ‘సెలవు రోజుల్లో కూడా డబ్బు రికవరీ చేయాల్సిందే. ఆఫీసు వేళలు అయిపోయాక మీకు ఫ్యామిలీ టైం కావాలా? కుటుంబంతో కలసి బయట తిరుగుతామంటారా? నేను అస్సలు ఊరుకోను. నేను నా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. కేవలం కెనరా బ్యాంక్ గురించే ఆలోచిస్తుంటా. మీరు ఏమైపోయినా ..బ్యాంకు కోసం ఆలోచించాల్సిందే అంటూ వీడియోలు తిడుతున్నారు. ఆదివారమైనా ...సెలవైనా ..నీ పర్సనల్ లైఫ్ లేకపోయినా బ్యాంకు కోసం నువ్వు పని చెయ్యాల్సిందేనంటు వార్నింగ్ ఇచ్చాడు ..అంతేనా నా మాట వినని వారు అధికారి అయినా, చీఫ్ మేనజర్( cheif manager) అయినా, ఏజీఎం అయినా ఉపేక్షించను జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఆ ఉద్యోగి తన టార్గెట్ ఎచీవ్ కానందుకు సారీ చెప్పినా వినడే..దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ఈ వీడియోపై కెనరా బ్యాంక్ ( canara bank) స్పందించింది. సంస్థ ఎదుగుదలలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యానికి ఎల్లప్పుడూ విలువ ఇస్తామని ‘ఎక్స్’( x) లో పేర్కొంది. తమ ఉన్నతాధికారి ప్రవర్తనను అంగీకరించట్లేదని.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంధన్ బ్యాంక్ సైతం ఇదే రీతిలో స్పందించింది. విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని.. ఉన్నతాధికారుల ప్రవర్తను ఖండిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఆ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.

Tags:
Next Story
Share it